సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశంలో అన్ని ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. సామాన్యు ప్రజల బ్రతుకు తెరువుకు ఎవరు భరోసా ఇవ్వలేకపోతున్నారు. మరో వైపు ప్రపంచాన్ని తరుముకొస్తున్న ద్రవ్యోల్బణం, రష్యా నుండి భారీ సబ్సిడీకి ఇంధనం కొనుగోలు చేస్తున్న దేశంలో మరో వైపు ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇకపై వచ్చే 2023 కొత్త ఏడాదిలో టివి ఛానెల్స్ వీక్షకులకు పెద్ద షాక్ తగలనుంది. ప్రముఖ టీవీ ఛానెల్స్ బ్రాడ్ కాస్టర్స్ తమతమ ఛానళ్లకు సంబంధించిన బొకే రేట్లను పెంచేశాయి. ఈ ధరల పెంపు నిర్ణయం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమలులోకి రానుంది. దీని కారణంగా, ఛానెల్స్ రీఛార్జ్ కోసం నెలవారీ సబ్ స్కిప్షన్ ప్యాక్ ఖరీదుగా మారనుంది. కేబుల్ టివి ధరలు పెరగనున్నాయి, అసలే ఇంటర్ నెట్ కనెక్షన్స్ ప్రభంజనంతో ( సాటిలైట్ FREE, PAY ఛానెల్స్ , యూ ట్యూబ్, యాప్ ఛానెల్స్ , విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులతో , మహిళలకు ఆన్ లైన్ షాపింగ్ తో సహా.. ) పట్టణాలలో కేబుల్ టివి ఇప్పటికే చివరి అంకానికి చేరుకొంటే..ఇప్పుడు ఈ చేనెల్స్ ధర పెంపు అటు కేబుల్ ఆపరేటర్ కు ఇటు వినియోగదారుడికి పట్టణాలలోనె కాదు గ్రామాలలో సైతం కొత్త ఇబ్బంది తెచ్చిపెడుతుంది, ఇక 3 సంత్సరాల తర్వాత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలుకు లోబడి .. సోనీ పిక్చర్స్ , స్టార్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్ తో సహా 42 మంది ప్రసారకర్తలు తమ 332 కంటే ఎక్కువ ఛానెల్లు పే ఛానెల్స్ చూడటానికి కొత్త నెలవారీ రుసుములను నిర్ణయించారు. కొత్త ధరలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2023 నుంచి అమల్లోకి రానున్నాయి, ఇప్పటికే కొన్ని ఛానెల్స్ బొకే ధరలు 10-15% రేట్లు పెంచినట్లు సమాచారం, అన్ని కలపి వినియోగదారుడికి తడిపి మోపుదు అవుతుందేమో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *