సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపటితో 2022 ముగుస్తుంది. అయితే ఈ న్యూఇయర్ కొత్త క్యాలెండర్‌తోపాటు.. క్రెడిట్ కార్డు, ఎన్‌పీఎస్, ఇన్సూరెన్స్ వంటి విషయాల్లో నూతన మార్పులను కూడా తీసుకొస్తోంది. 2023 జనవరి 1 నుంచి అమలులోకి రాబోయే కొత్త రూల్స్ ప్రకారం.. . ప్రస్తుతం మార్కెట్‌లో లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికిల్ ఇన్సూరెన్స్ అంటూ ఇలా చాలా రకాల ఇన్సూరెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే.. జనవరి 1 నుంచి ఏరకమైన ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే.. KYC డాక్యుమెంట్లను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.IRDAI కొద్ది రోజుల క్రితమే ఇందుకు సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు.. ఇకపై సెల్ఫ్ డిక్లరేషన్లు సమర్పించి తమ ఎన్‌పీఎస్ అకౌంట్ల నుంచి ఆన్‌లైన్ ద్వారా పాక్షిక మొత్తాలను విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఇక ఉండదు. దీనిపై PFRDA డిసెంబర్ 23న ప్రకటన విడుదల చేసింది. SBI కార్డును ఉపయోగించి అమెజాన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే.. కస్టమర్లకు 10X రివార్డు పాయింట్లు వచ్చేవి. కానీ జనవరి 1 నుంచి కేవలం 5X రివార్డు పాయింట్లు మాత్రమే రానున్నాయి. అయితే.. బుక్‌మైషో, క్లియర్‌ట్రిప్, లెన్స్‌కార్ట్, నెట్‌మెడ్స్‌ తదితర వెబ్‌సైట్‌లలో క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే ఎప్పటిలాగే 10X రివార్డు పాయింట్లను అందిస్తోంది.HDFC Credit Card కూడా రివార్డు పాయింట్ల కేటాయింపు, రీడీమ్ చేసుకునే విషయాల్లో పరిమితులు విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *