సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పౌర హక్కుల కు భంగం కలిగించే కొత్త క్రిమినల్ చట్టాలు అమలును నిలుపుదల చేయాలని తణుకు పట్టణానికి చెందిన న్యాయవాదులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .శుక్రవారం నాడు తణుకు బార్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్, ఆల్ ఇండియా లాయర్స్ ఆధ్వర్యంలో జూలై 1 నుంచి అమలు జరిగే కొత్త క్రిమినల్ చట్టాలు అమలు చేయుట ను నిలుపుదల చేయాలని కోరుతూ నిరసన తెలియజేశారు .ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. బ్రిటిష్ నాటి చట్టాలను మార్పు చేసి భారత దేశమునకు అనుగుణమైన చట్టాలను చేసినట్లుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వము ప్రకటించిందని అన్నారు .కానీ గత చట్టంలో ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏ వ్యక్తికి సంకెళ్లు వేయరాదని అతని స్వేచ్ఛకు భంగం కలిగించరాదని తీర్పులు చెప్పగా నేడు కొత్త చట్ట ప్రకారము చేతులకు బేడీలు వెయ్యవచ్చునని తెలుపుతున్నది, న్యాయస్థకు ఉన్న అధికారాలను తగ్గించి,పోలీసు అధికారులకు, ఎగ్జిక్యూటివ్ అధికారులకు జ్యుడీషియల్ అధికారాలను కొత్త చట్టలుకల్పించిందని దీనివలనప్రజల జీవన విధానాలకు నష్టం ఉందని అన్నారు.పోలీస్ వారు పోలీస్ స్టేషన్కు రమ్మని ఎవరినైనా పిలిచిన ఆ వ్యక్తి రానిపక్షంలో అతనిపై పోలీసు వారు క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి అరెస్టు చేసి తీసుకెళ్లి అధికారులు కొత్త చట్టం కల్పిస్తుంది అని అన్నారు. వీటిని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఏ .బాలరాజు కౌరు వెంకటేశ్వర్లు ,ఈ. అశోక్ కుమార్ బండి వెంకటేశ్వర్లు, ఏ ,దుర్గా ప్రశాంతి కామన మునిస్వామి ,చింతపల్లి నాగేశ్వరరావు, నీలం హరీష్ నాయుడు జి .అంబేద్కర్ఎన్ .సోమేశ్వరరావు, ఎస్.కె బాజీ ,పి .ప్రతాప్ కుమార్ ,ఎన్ సాంసంన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *