సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ నేడు, సోమవారం సాయంత్రం రెలీజ్ అయ్యింది. థియేటర్స్ ట్రైలర్ ను భీమవరం విజయలక్ష్మి థియేటర్స్ లో అభిమాన సందోహం మధ్య రిపీట్ రిపీట్ వేశారు. ట్రైలర్ హాలీవుడ్ స్థాయిలో అద్భుతంగ ఉందని కామెంట్స్ వచ్చాయి. నిజంగా ఒక కొత్త ప్రపంచం కనపడుతుంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. కల్కి సినిమాలో ప్రభాస్ భైరవగా కనిపించనున్నాడు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ అశ్వథామ గా కీలక రోల్ లో నటించారు.కొత్త ప్రపంచం రాబోతుంది అంటూ కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రను కొత్త గెటప్ లో ఆకట్టుకొన్నారు. మరో బాలీవుడ్ అందాల తార దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, పశుపతి, అన్నాబెన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే రిలీజైన టీజర్స్, పోస్టర్స్, కల్కి సినిమాపై అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ప్రభాస్ బుజ్జి కారు దేశమంతా చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 27న రిలీజ్ కానుంది.
