సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు ఢిల్లీ లో నేడు రచ్చబండ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఈ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో స్వయంగా అధికార పార్టీ ఎంపీని పోలీసు కస్టడీలో చితకబాదడం ద్వారా, పోలీసుల దమన కాండ పరాకాష్టకు చేరుకుంది. ప్రజల ప్రాణాలను కాపాడడానికి, ఇప్పుడు 1861 పోలీసు చట్టానికి వక్ర భాష్యం చెబుతూ చీకటి జీవోను తీసుకువచ్చారు. తమ పార్టీ నాయకత్వం ర్యాలీలు నిర్వహించిన ప్రజలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ర్యాలీలను నిషేధిస్తూ జీవో నెంబర్ 1 ని జారీ చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, న్యాయస్థానమే ఈ జీవోను కొట్టివేస్తుంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఆగడాలని ఇంకా భరించే స్థితిలో లేరని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఒకవేళ ఈ ప్రభుత్వం మారితే,(చంద్రబాబు, జనసేన ప్రభుత్వం? లేక బీజేపీ కూడా కలుపుకొని?) అధికారంలోకి రానున్న ప్రభుత్వం ఇంతకంటే రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని వారి తరపున భరోసా ఇచ్చారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలలో అణా, కాని కూడా ఎవరికి తగ్గదనేది సుస్పష్టం.. ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాలకు తోడు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలకు మార్జిన్ మనీ అందజేసి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుకు , రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. పవన్ ఒక్క సినిమా తీస్తే రూ.100 కోట్లు.. ఆయనకు అడుక్కునే కర్మ ఏంటి? అని వైసిపి మంత్రులను ప్రశ్నించారు. పవన్‌ను కాపు సామాజిక వర్గానికే పరిమితం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
