సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ జనసేన నేతలు ఆస్తులు రిజిస్ట్రేషన్స్ ఫై ప్రజలకు అనేక అపోహలు సృష్టిస్తూ ‘రిజిస్ట్రే షస్ట్రేన్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బ తీసేలా నేతలు ప్రచారం చేస్తున్నారు. అని విమర్శించారు. ఈసైన్ ద్వారా, ఆధార్ ద్వారా ఆస్తులు రిజిస్ట్రేషస్ట్రే న్ చేస్తున్నాం. అక్కడ మెమోలో ఉన్నది.. ఒకటైతే దానిని మర్చి విపక్షాలు మరొకటి విష ప్రచారం చేస్తున్నారు. దేశమంతా ఈ చట్టం అమలు చేయాలని కేంద్రప్రభుత్వమే సూచించింది. వివాదాలకు తావులేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగింది. దళారి వ్యవస్థ ఉండకూడదని యాక్ట్ తెస్తున్నాము. భూమి రిజిస్ట్రేషన్ పేపర్లకు బదులు కేవలం జిరాక్స్ పేపర్లు ఇస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జిరాక్స్ పేపర్లు ఇస్తారు అనేది అబద్ధం. అసలు ఎన్నికల కోడ్ లేకపోతే తప్పుడు ప్రచారం చేసేవారిపై వెంటనే చర్యలు తీసుకోనే వాళ్లం. అసలు ఇంకా యాక్ట్ రాలేదు, రాని ఆక్ట్ ను తొలగిస్తామని చంద్రబాబు చెబుతున్నాడు.
చట్టం అమలు చేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తాము. ప్రజల ఆస్తులకు మరింత రక్షణ కల్పించాలనేది సీఎం జగన్ ఆలోచన అన్నారు. చంద్రబాబు కూటమి పేరుతొ విడుదల చేసిన మ్యానిపెస్టో చెత్తబుట్టలో వేసుకోవాలని అవేమి అమలు చెయ్యరని ఎద్దేవా చేసారు. .
