సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల మరల పలు రాష్ట్రాలో కరోనా ఛాయలు మళ్లీ కనిపించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు, సోమవారం వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష చేపట్టారు. ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సీఎస్ జవహర్ రెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రెటరీ కృష్ణబాబు, ఇతర అధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. కొత్త ఏడాది, వరుస పండుగలు సమీపిస్తున్నవేళా.. రాష్ట్రంలో సమస్య లేదని అయితే ఒకవేళ కేసులు పెరిగితే తీసుకోవలసిన చర్యలు.. . కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ లు ధరించాలని గతంలో ఎలాగయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు చేప్పట్టిన రక్షణ చర్యలు దేశానికీ ఆదర్శంగా నిలిచాయో , అదే రీతిన వాలంటర్స్ మొదలుకుని ఫై స్థాయి అధికారుల వరకు సమన్వయంతో పనిచేస్తూ కరోనా నుండి ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసారు. సంక్రాంతి పండుగ తరువాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.
