సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సమీపంలోని కొల్లేటికోట పెద్దింటి అమ్మవారి జాతర. ఈనెల 11వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దేవాలయం అభివృద్ధి , భక్తులకు వసతి ఏర్పాట్లు పెరగటం, కొత్త వంతెన నిర్మాణం, రోడ్డులు పూర్తీ అయ్యి ప్రారంభించడంతో ఈసారి ఉత్సవాల కు భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కువ సంఖ్యలో హాజరు అయ్యే అవకాశం ఉంది. దానితో దేవాలయ ఉత్సవ నిర్వాహకులు భక్తుల దర్శనార్ధమై పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు మొక్కుబడులు చెల్లించేందుకు, పాలపొంగళ్ళను పొంగించుకునేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు ఆలయం చుట్టూ చలువ పందిళ్ళను ఏర్పాటు చేసి పలు తోరణాలతో అలంకరణలు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు.
