సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు కు సమీపంలో ఉన్న సుదీర్ఘ వేలాది సంవత్సరాల చారిత్ర ఉన్న కొల్లేరు సరస్సు లోని కొల్లేటి కోట గ్రామం లోని మహిమానిత శ్రీ పేదింట్లమ్మ అమ్మవారి పుణ్య క్షేత్రం లో వచ్చే మార్చి నెల 1వ తేదీ శనివారం నుండి 13వ తేదీ గురువారం వరకు 13 రోజుల జాతర వార్షిక మహోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఒరిస్సా. కర్ణాటక నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాలయ ఇఓ కూచిపూడి శ్రీనివాస్ తెలిపారు
