సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణ జిల్లా మధ్య విస్తరించిన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు (kolleru) మంచినీటి సరస్సు విదేశీ వలస పక్షులకు విడిది కేంద్రం గా శతాబ్దాలుగా రాణిస్తుంది. ప్రపంచ నలుమూలల నుండి ఎన్నో వేల కిలొ మీటర్లు దూరం నుండి రష్యా సైబీరియా, ఆస్ట్రేలియా దేశాల నుండి సైతం పక్షులు ఇక్కడకు వస్తూఉంటాయి. అయితే వాటి రక్షణ కోసం ఏర్పాట్ల కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అరకొర నిధులతోనే ఏర్పాట్లు అభివృద్ధికి కృషి చేస్తున్నాయి తప్ప బారి ప్రాజెక్టు దిశగా చర్యలు చేపట్టాక పోవడం పర్యావరణ ప్రేమికులను నిరాశ పరుస్తుంది. అయితే ఈ శీతాకాలం సీజన్ లో విదేశీ కొల్లేరుకు విడిదికి వస్తాయని తెలిసి రాష్ట్ర బ్రాంచి ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్యాలయం రూ.50 లక్షల ఖర్చుతో స్వయంగా స్టాండ్లను తయారు చేయించి పక్షుల ఆవాస కేంద్రాలలో ఏర్పాటు చేసారు. కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రంలో 50 స్టాండ్లు, మాధవాపురంలో 50 స్టాండ్లను స్వచ్ఛందంగా ఏర్పాటు చేశారు. చెట్లు తక్కువ ఉన్న ప్రాంతాలలో పక్షులు నిలబడటానికి ఈ కృత్రిమ ఐరన్‌ స్టాండ్లు ఉపయోగ పడుతున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇక పర్యావరణ విద్యా కేంద్రం వద్ద కరెంట్ లేకపోయిన పనిచేసేలా సోలార్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *