సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొల్లేరు ప్రజలకు అలాగే కొల్లేటి కోట లోని శ్రీ పెద్దింట్లమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఎన్నో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సాహసోపేత నిర్ణయాలతో కొల్లేరు సరస్సు ఇప్పటికి సజీవంగా ఉంది. లేకపోతె ఎప్పుడో కబ్జా అయ్యి చరిత్రలో మిగిలిపోయేది అనే సత్యం అందరికి సుపరిచితమే.. ఆయన హయాంలో కొల్లేరు ఆపరేషన్ తర్వా త రూ.3,500 కోట్ల పునరావాస ప్యా కేజీని ప్రజలకు అందించారు. ప్రధానంగా కొల్లేరు ప్రజల చిరకాల కల సర్కా రు కాల్వ పై వారిధి నిర్మాణానికి 2009లో రూ.12 కోట్లను వైఎస్ కేటాయించారు. ఆయన ఆకస్మిక మరణం తర్వాత పనులు జరగలేదు. గత చంద్రబాబు ప్రభుత్వంలో అంచనాలు పెరిగి రూ.14.70 కోట్లు కేటాయించినప్పటికీ పనులు పూర్తీ కాలేదు. అయితే ఎట్టకేలకు స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వర రావు హయాంలో సీఎం జగన్ సహకారంతో వారధి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. అతి త్వరలో నూతన బ్రీజ్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అలాగే చరిత్ర లో పురాతన దేవాలయంగా నిలచిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఆవరణలో భక్తుల సౌకర్యం కోసం జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా 305 మీటర్లపొడవు, 105 మీటర్ల వెడల్పుతో భారీ అనివేటి మండపం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇకపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఆవరణలో ఎండకు, వానకు ఇబ్బంది పడనవసరం లేదు.
