సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్న కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాలలో వాస్తవ పరిస్థితులు చూడడానికి గత 2 రోజులుగా పర్యటించిన కేంద్ర ప్రభుత్వ సాధికార కమిటీ అధికారులు జిల్లా అధికారులను, స్థానిక పర్యావరణ సంఘాల సభ్యులతో ఇక్కడి సమగ్ర సమాచారాన్ని మాకు అందించండి. కొల్లేరు అభయారణ్యం పరిధిలో రోడ్ల నిర్మాణం, నిర్వహణ, కాలుష్యం,పారిశుధ్య వ్యర్థాలు, శుద్ధీకరణ సామర్థ్యం, సరస్సు ఆక్రమణలతో పరిధిలో చేపల పెంపకానికి వినియోగించే రసాయన ఎరువులు, పురుగు మందుల వివరాలు మేము కోరిన సమాచారం వేగంగా అందేలా సమీకరించి పంపండి అని ఆదేశాలిచ్చింది. అలాగే కొల్లేరుపై క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా మత్స్యశాఖ అధికారులను ఆదేశించింది. అధికారుల సమాచారం తో వచ్చే 3 నెలల్లో కమిటీ కొల్లేరు ఫై రిపోర్ట్ విడుదల చేయనుంది. ఏలూరులో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ ఉప సభాపతి ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *