సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా ‘‘కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. నేటి సోమవారం ఉదయానికి దేశంలో 4వేలు కేసులు దాటాయి. ముఖ్యంగా కేరళలో అయితే రోజు వందలాదిగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే.. సంతోషించదగ్గ తాజా వార్త ఏమిటంటే.. ఇటీవల ఒమిక్రాన్ నుంచి పుట్టుకొచ్చిన సబ్ వేరియంటే జేఎన్.1 ప్రజలు బయపడుతున్నంత ప్రమాదకారి కాదు అని తాజగా వైద్య పరిశోధకులు నిర్ధారిస్తున్నారు. ఈ కరోనా వైరస్ దగ్గు, జలుబు, సాధారణ జ్వరం మాదిరిగానే ఇలా వచ్చి.. అలా వెళ్లిపోతుంది. కొవిడ్-19 ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తేగానీ తెలియదు. ఇప్పటికే చాలా మందికి ఈ వైరస్ సోకి, కోలుకుని ఉండొచ్చు. ఇటీవలికాలంలో పరీక్షలను పెంచడం వల్లే.. కేసులు వెలుగుచూస్తున్నాయి. జేఎన్.1 వేగంగా వ్యాపించే గుణం ఉన్న వేరియంట్. అయితే పెద్దగా ప్రమాదకారి కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కూడా ఈ వేరియంట్ ప్రమాదకారి కాదని స్పష్టం చేసింది. అందుకే.. ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదు.ఇంటివద్దే 5 రోజులపాటు మందులు వాడితే చాలు. ఇప్పటికే 5 రోజుల కోర్సుకు సంబంధించిన మందులు మార్కెట్‌లో దొరుకుతున్నాయి.రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు, గుండెజబ్బు, శ్వాస కోశ ఇబ్బందులు ఉన్నవారు వృద్దులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి’’ అని యశోద ఆస్పత్రి సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావు స్పష్టం చేశారు.
