సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కొవ్వాడ అన్నవరం గ్రామంలో 3 కోట్ల 34 లక్షల 64 వేల రూపాయలతో జరిగిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా 65 లక్షల రూపాయలతో కోవ్వాడ అన్నవరం మెయిన్ రోడ్ నుండి కలిదిండి నరసింహరాజు ఇంటి వరకు నిర్మాణం చేసిన సిసి రోడ్,డ్రైన్ సైడ్ వాల్,ఆర్.సి.సి కల్వర్ట్ ను ప్రారంభించారు.అనంతరం 69 లక్షల 94 వేల రూపాయలతో “మనబడి నాడు నేడు” పేజ్ -2 లో జడ్.పి.హెచ్.ఎస్ కొవ్వాడ నందు ఆరు అదనపు తరగతి గదుల నిర్మాణం కు శంకుస్థాపన చేశారు. మరియు 74 లక్షల రూపాయలతో నిర్మించిన ఇంటర్నల్ సిసి రోడ్లు, మెయిన్ రోడ్డు,చర్చి రోడ్డు, ఆర్ సి.సి పైప్ కల్వర్టు లను ప్రారంభించారు. తదనంతరం 62 లక్షల రూపాయలతో వెల్లటూరులో నిర్మించిన ఇంటర్నల్ సిసి రోడ్లను,64 లక్షల రూపాయలతో వెల్లటూరు మెయిన్ రోడ్డు లో నిర్మాణం చేసిన సిసి రోడ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉద్దరాజు ఆనంద విశ్వనాధరాజు, ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహ రాజు, పంచాయతీరాజ్ డి ఈ స్వామి నాయుడు ,సమగ్ర శిక్షణ డి ఈ శక్తి శ్వరరావు, ఇంచార్జ్ ఎంపీడీవో రామచంద్ర ప్రభు, ఈవో పి ఆర్ డి జెడివి ప్రసాద్, తాళ్లూరి ఆశీర్వాదం,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *