సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం గ్రామంలో సుమారు రూ 1కోటి 78 లక్షల అభివృద్ధి పనులకు,నరసింహాపురం గ్రామంలో రూ కోటి 31 లక్షలతో పలు అభివృద్ది పనులకు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబుతో కలసి శంకుస్థాపన చేశారు. సుమారు రూ కోటి 28 లక్షలతో 7 సీసీ రోడ్లకు శంకుస్థాపన, 2 సీసీ రోడ్లు, రూ 10 లక్షలతో సంపు నిర్మాణం, రూ 40 లక్షలతో పీడబ్ల్యుఎస్ పథకంతో రెండు మైక్రో పిల్టర్లను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే అంజిబాబులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు ప్రారంభించుకుంటున్నామని, ఐదేళ్ల తరువాత అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి వర్మ అన్నారు. అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. అభివృద్ధి అంటేనే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మరోసారి రుజువు అయ్యిందని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గ్రామాల్లో పూర్తిస్థాయిలో మంచినీటిని అందించడమే లక్ష్యమని అన్నారు. గ్రామాల్లోని మోడరన్ గ్రామాలుగా తీర్చిదిద్దడమే కూటమి ధ్యేయమని, ఈ తొమ్మిది నెలల్లో ప్రతి గ్రామంలోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని, అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రభుత్వ అధికారులు, కూటమి అభిమానులు పాల్గొన్నారు.
