సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం కొవ్వాడ గ్రామంలో విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం(NSS) ఏడు రోజుల ప్రత్యేక శిబిరం ముగింపు వేడుకలు నేడు, గురువారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మంగం వేణు మాట్లాడుతూ.. తమ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక కార్యక్రమలలో చురుకుగా పాల్గోని మరియు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేశారని తెలియజేసారు. ఈ ఏడు రోజుల ప్రత్యేక శిబిరం ద్వారా గ్రామస్థులకు మొక్కల పెంపకం యొక్క ప్రాముఖ్యత, పర్యావరణం యొక్క పరిశుభ్రత, మంచి ఆరోగ్యం మరియు పర్యావరణాన్ని కాపాడుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారుఅని అన్నారు. ఈ కార్యక్రమంలో విష్ణు ఇన్స్టిట్యూట్ ,, డైరెక్టర్ డాక్టర్ దశిక సూర్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీ లక్ష్మి వివిధవిభాగాధిపతులు, ఎన్.ఎస్.ఎస్. కోఆర్డినేటర్ డా.కె గంగ రాజు, కొవ్వాడ గ్రామ కార్యదర్శి M. ప్రవీణ్ కుమార్, పంచాయతీ ఇంచార్జి V. నరసింహరాజు, కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
