సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ దివాన్‌చెరువు నుంచి కొవ్వూరు వరకూ సుమారు రూ.808 కోట్లతో గోదావరిపై నిర్మించిన గామన్ బ్రిడ్జి మళ్లీ కుంగింది. గత ఆదివారం సాయంత్రం గామన్ బ్రిడ్జిపై కొవ్వూరు నుంచి రాజమండ్రి వైపు వెళ్లే దారిలో 52వ స్తంభం జాయింట్ వద్ద వంతెన అర అంగుళం మేర కుంగినట్లు సివిల్ అధికారులు గుర్తించారు. వంతెనకు యాక్షన్ ఇచ్చే బేరింగ్‌లు మరమ్మతులకు గురికావడమే దీనికి కారణమని తేల్చారు. దీంతో కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే దారిలో వాహనాలను నిలుపుదల చేశారు. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వైపు రెండు వైపుల వాహనాలకూ అనుమతివ్వడంతో ఈ దారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభిస్తోంది. నిపుణుల బృందం నేటి సోమవారం ఉదయం నుండి బ్రీజ్ ను పరిశీలించి మరమ్మత్తులు చేపడుతుంది.. గామన్ సంస్థ 2007లో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించింది. 2015లో పుష్కరాల నిమిత్తం హడావుడిగా ప్రారంభించారు. అయితే ఆరంభంలోనే ఈ బ్రిడ్జి ఒకసారి కుంగింది. మళ్లీ ఇన్నేళ్లకు మరమ్మతులకు రావడం గమనార్హం..
