సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జైలుకు వెళ్లడం, విడుదల అయ్యాక మరల దొంగతనం చేయడం, దాడులు చెయ్యడం .. జైలుకు వెల్లడం ఇదే వృత్తి దైనందిన జీవనంగా మార్చుకున్న ఉభయ గోదావరి జిల్లాల దొంగలను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని, కొవ్వూరు పట్టణ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. తాజగా.. ఎస్పీ నరసింహ కిశోర్ వీటి వివరాలను మీడియాకు తెలిపారు. . కొవ్వూరులోని మహమ్మద్ మహారాజ్‌కి చెందిన అపార్ట్‌మెంట్‌లో కట్టా ఉషశ్రీ నివాసంలో గతనెల 26న జరిగిన భారీ చోరీ నేపథ్యంలో . ఎస్పీ ఆదేశాలతో కొవ్వూరు పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐ పి.విశ్వం ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.. వారు ప్యూహాత్మకంగా దొంగలను పెట్టుకొని వివరాలు తెలిపారు. కాకినాడ జిల్లా ఏటిమొగకు చెందిన పొన్నాడ రవిశంకర్ (వీరబాబు)ను, భీమవరం పాలూరువారి వీధికి చెందిన లంకలపల్లి నాగరాజును అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. యాక్టివా బైక్‌తోపాటు రూ.15.30లక్షల విలువ చేసే 400 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశామన్నారు. మరికొంత బంగారాన్ని ఒక ఫైనాన్సులో కుదువ పెట్టారని దానిని రికవరీ చేయాల్సి ఉందన్నారు. గతంలో వీరబాబుపై పశ్చిమ గోదావరి జిల్లాలో 22, విశాఖలో 16, తూర్పు గోదావరిలో 2, శ్రీకాకుళంలో 2, విజయనగరం, అనకాపల్లి జిల్లాలో ఒక్కోటి కలిపి మొత్తం 44 కేసుల్లో జైలుశిక్ష అనుభవించాడని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒక కేసులో శిక్ష అనుభవించి విడుదల అయ్యాడన్నారు. రెండో నిందితుడు నాగరాజుపై గతంలో క్రికెట్ బెట్టింగ్‌పై భీమవరంలో, హత్యాయత్నంపై పాలకోడేరులో నమోదైన కేసుల్లో జైలుకు వెళ్లొచ్చాడని ఎస్పీ చెప్పారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన కొవ్వూరు టౌన్, రూరల్ సీఐలు పి.విశ్వం, కె.విజయ బాబు, ఎస్‌ఐలు పి.రవీంద్రబాబు, కె.జగన్మోహన్ రావు, ఇతర పోలీసులను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు
