సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు లో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గోదారమ్మకు కార్తీకహారతి ఇవ్వనున్నట్లు కొవ్వూరు ఎమ్మెల్యే ఎం.వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ .నవంబర్ లో కార్తీకమాసం నేపథ్యంలో 4న సాయంత్రం అత్యంత వైభవంగా గోదావరికి పలు హారతులు ఇస్తారన్నారు. గోదావరి హారతికి శాఖలవారీగా కేటాయించిన ఏర్పాట్లు పటిష్టవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమానికి 10 వేల మందికి పైగా వచ్చే అవకాశం ఉందన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
