సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలలో పలు ఇళ్లలోకి ప్రవేశించి చోరీలకు పాల్బడిన ఇద్దరు అంతర జిల్లా నేరస్థులను కొవ్వూరు పోలీసులు అరెస్టు చేసారు. వారి వద్ద నుండి రూ.30 లక్షలు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని కొవ్వూరు డీఎస్పీ, వీఎస్ఎన్ వర్మ తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం..కొవ్వూరు పట్టణ సీఐ. ఏఎల్ఎస్ రవికుమార్ మెరకవీధి కూడలికి వెళ్లగా ఓ వ్య క్తి తనను చూసి పారిపోతున్నట్లు గమనించి వెంబడించి పట్టుకుని ప్రశ్నించగా ఏలూరు ఆర్టీసీ కాలనీ, నిమ్మ కాయల యార్డు ప్రాంతానికి చెందిన షేక్ మున్నా అలియాస్ సిరి,అలియాస్ సాయిగా తెలిసింది. ఆపరేషన్ చేయించుకొని నపుంసకుడుగా మారి కొవ్వూరు, సమిశ్రగూడెం , ఏలూరు, చాగల్లు, నిడదవోలు, దేవరపల్లి, దెందులూరు పరిధిలో పలు చోట్ల బంగారం, వెండి, సెల్ ఫోన్ లు చోరీలు చేయగా 14 కేసులు నమోదయ్యాయి. చోరీ చేసిన వాటిని అమ్మెందుకు కొవ్వూరులో తిరుగుతుండగా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.10.50 లక్షలు విలువైన 200.63 గ్రాముల బంగారం , 185గ్రాముల వెండి ఆభరణాలు, రెండు మొబైల్ ఫోన్ లు స్వా ధీనం చేసుకున్నారు. మరో నేరస్థుడు విశ్వాస్ అనిల్ మారన్ ఉండ్రాజవరం మండలం కె.సావరంలో పోలీసులు పట్టుకుని అరెస్టు చేసి 346 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతను గతంలో చేసిన చోరీలకు సంబంధిం చి కాకినాడ,అన్నవరం, తణుకు, పెరవలి స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతని నుంచి రూ.19.50 లక్షలు విలువైన 346 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొవ్వూరు, తణుకు సీఐలు రవికుమార్, కె.వెంకటేశ్వ రరావు, ఎస్ఐలు బి.దుర్గాప్రసాద్, రామారావు, సీసీఎస్ ఎస్ఐ పి.రవీంద్ర, సిబ్బం దిని అభినం దిం చి రివార్డుల కోసం జిల్లా ఎస్పీ కి సిఫార్సు చేసారు.
