సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని నరసరావుపేట మండలంలో గల ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం కోటప్పకొండకు నేడు, సోమవారం పౌర్ణమి నేపథ్యంలో వేల సంఖ్యలో భక్తులు కోటప్పకొండకు తరలి వచ్చి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. కోరిన కోర్కెలు స్వామి నెరవేరుస్తారని మొక్కుకున్న భక్తులు ప్రతి పౌర్ణమికి కోటప్పకొండ గిరి ప్రదక్షిణ జరుగుతుందన్న విషయం తెలిసిందే. నేడు జరిగిన గిరిప్రదక్షిణలో అపశృతి చోటుచేసుకుంది. వడగాల్పుల తీవ్రత ఎక్కువ ఉండటంతో పలువురు నీరసించి పోయారు. మొత్తం 7 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణంలో 6న్నర కిలో మీటర్లు నడిచిన ఓ భక్తుడు కళ్లు తిరిగి కిందపడటంతో పక్కనున్న భక్తులు గమనించి వెంటనే రోడ్డు పైకి తీసుకు వచ్చేసరికే ప్రసాద్(50) మృతిచెందాడు. మృతుడు ప్రసాద్ చిలకలూరిపేట మండలం పురుషోత్తపట్నం వాసిగా గుర్తించారు. తీవ్ర విషాదం తో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు.
