సిగ్మాతెలుగు డాట్, న్యూస్: దశాబ్దాల ప్రజల ఆకాంక్ష .. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలను మరింత దగ్గర చేసే కోటిపల్లి – నరసాపురం మధ్య నిర్మిస్తున్న రైల్వే పనులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ వాటా నుండి రైల్వేలైన్‌ నిర్మాణంలో భూసేకరణకు తాజగా రూ.50 కోట్లు నిధులు మంజూరు చేసిందని అమలాపురం ఎంపీ చింతా అనురాధ, మీడియాకు తెలిపారు. ఈ రైల్వే ట్రాక్ నిర్మాణ పంవల్లవు ఎటువంటి అపోహలు వద్దని, రైల్వేలైను నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. దీనికోసం ఇప్పటివరకు కేంద్ర రైల్వే శాఖ నుండి రూ.1,409 కోట్లు నిధులు సాధించామన్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో రూ.300 కోట్లు, రైల్వే ట్రాకుల మరమ్మతులకు రూ.10 కోట్లు, భూసేకరణకు రూ. 50 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *