సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హరిహర వీరమల్లు సినిమాకు ఒక రోజు తరువాత ఏ మాత్రం అంచనాలు లేకుండా .. గత వారం శుక్రవారం రోజు విడుదలయిన యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ తెలుగు తో పాటు పాన్ ఇండియా స్థాయిలో కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధిస్తూ సంచలన విజయం సాధించింది. కేజీఎఫ్ (KGF)1, 2, కాంతారా (Kantara), సలార్ (Salaar) వంటి భారీ హిట్ చిత్రాలను నిర్మించిన హోంబలే సంస్థ (Hombale Films), క్లీమ్ ప్రొడక్షన్స్ తో కలిసి తెరకెక్కించిన యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ (Mahavatar Narsimha). భారతీయ సంస్కృతికి అద్దం పట్టే శ్రీ నరసింహ స్వామి పురాణ గాథను సరికొత్త సాంకేతిక సహాయంతో మంచి క్వాలిటీ తో తెర పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. యానిమేషన్ అయినప్పటికీ పాత్రలతోనూ, ఆ భావోద్వేగాల తోనూ మరింత కనెక్ట్ అయ్యేలా దృష్టి సారించారు. ఎలాంటి పబ్లిసిటీ హంగులు, ఆర్భాటం లేకుండా తక్కువ థియేటర్స్ లో విడుదలయినప్పటికీ ఇప్పటికే 4 రోజులకు పాన్ ఇండియా సినిమాగా 40 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించగా అందులో తెలుగు వెర్షన్ సుమారు 9 కోట్లు సాధించడం విశేషము.
