సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో దారుణ పరాజయం పాలయిన వైఎస్సార్సీపీ రాష్ట్రంలో 10 అసెంబ్లీ సీట్లు, 4 సీట్లు గెలవడం, పార్టీ అధినేత జగన్ పోటీ చేసిన పులివెందులలో టీడీపీ అభ్యర్థి రవీంద్రనాథ్రెడ్డిపై 61,169 ఓట్ల మెజారిటీతో సీఎం జగన్ విజయం సాధించారు. ఆయన నేడు, సాయంత్రం మీడియాలో ప్రజలతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నా ప్రభుత్వ హయాంలో కోట్ల మంది కి మంచి చేశా .. ప్రభుత్వ సేవలు ప్రతి ఇంటికి వెళ్లేలా సచివాలయాలు , వాలంటీర్లు సేవలు ఏర్పాటు చేసాము. సమ సమాజ స్థాపనకు కృషి చేశాను, కోవిద్ సమయంలో ప్రజలను అన్ని రకాలుగా ఆదుకొన్నాను ఉచిత వైద్య సేవలు , ధన సహాయంతో ఎందరినో కాపాడగలిగాము, వృద్దులకు పింఛనులు 3వేలకు పెంచాను, అక్క చెల్లెమ్మలు కు విద్యార్థులకు కలపి 2 కోట్ల మందికి పైగా ప్రభుత్వ సాయం డైరెక్టుగా అందేలా చేశాను. అయితే అక్క చెలెమ్మల ఓట్లు ఏమయ్యాయి?అవ్వాతాతల ఆప్యాయతలు ఏమయ్యాయి? నాకు అర్ధం కాలేదు. నేను మాత్రం మేనిఫెస్టో లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేశాను. కూటమి పేరుతొ మోడీ తో పాటు పవన్ కళ్యాణ్ వంటి పెద్దలు కలిశారు.వారు సాధించిన ఈ అపూర్వ విజయానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఐ దారుణ ఓటమి కి కారణాలు ఆ భగవంతుడీకే తెలియాలి. నాతో పాటు నిలచిన 40 శాతం ఓటర్లు లకు కృతఙ్ఞతలు తెలుపుతున్నాను, ప్రతి పక్షం గా నాకు చాల ఏళ్ల అనుభవం ఉంది. కక్ష పూరిత కేసులకు భయపడను. ఇప్పడు కూడా ప్రజల కష్టంలో నా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను, అంటూ బాధ తప్త మాటలతో సీఎం జగన్ తన రాజీనామాకు సిద్ధం అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *