సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి వ్యాప్తంగా కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని భీమవరం లోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎస్పీ యు.రవిప్రకాశ్ మరోసారి హెచ్చరించారు. వీటి కట్టడికి ఇప్పటికే ప్రత్యేక పోలీస్ స్వాడ్ ద్వారా పందాల నిర్వాకులను గుర్తించి వారికీ హెచ్చరికలు జారీ చేశామని, చైతన్య కమిటీలను నియమించామని, వారి ద్వారా సంక్రాంతి వేడుకను పట్టణ, గ్రామాల్లో ప్రశాంతంగా ఆనందంగా నిర్వహించుకునేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు.సంప్రదాయం పేరుతొ సంక్రాతి ముసుగులో పందేలేస్తే ఊరుకోం అని, స్థలం ఇచ్చిన స్థల యజమానులు పైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎక్క డైనా పందేలు, జూదాలు నిర్వహిస్తే డయల్ 100, సమీపం లోని పోలీసు స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇటీవల యండగండిలో కోడి పందేలు నిర్వహిస్తున్న వారిని అడ్డుకొన్న పోలీసులపై దాడులకు దిగినవారిలో కొందర్ని అరెస్ట్ చేసామని మిగతావారిని వదిలేది లేదని అలాగే మొన్న క్రిస్మస్ సాయమయంలో వీరవాసరం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహించిన పందేల నిర్వాహకులను అదుపులోకి తీసుకుంటున్నాం . గ్రామస్థాయిలోనే పోలీసు, ఇతర శాఖల అధికారుల సమన్వయం తో కమిటీలు ఏర్పా టు చేస్తున్నాం . గతంలో పందేలు నిర్వహించిన వారి జాబితా ప్రకారం ఇప్పటి వరకు 1006 మందిని బైండోవర్ పెట్టి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు.
