సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పండగ సమీపిస్తున్న పచ్చని కోనసీమలో గ్యాస్ అగ్ని మంట నేడు, శుక్రవారం 5వ రోజు సైతం కొనసాగుతుంది. దీంతో ఇంకెన్ని రోజులు మాకు ఈ మంటలు అంటూ కోనసీమ జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క గత నాలుగు రోజులుగా సిబ్బంది ఏక ధాటిగా మంటలపై వాటర్ ఫైరింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో మంటలు ఉదృతి కాస్త తగ్గినప్పటికీ ఆ నీటి ధాటికి చుట్టుప్రక్కల 3గ్రామాల వరి పొలాల సైతం ఆ నీటితో మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ గ్యాస్ కష్టాలు మాకు వద్దు.. ఈ ఒఎన్‌జిసి వద్దు.. అంటూ ప్రజలు, రైతులు ఒఎన్‌జిసి కార్యాలయం వద్ద నినాదాలు తెలపడంతో పాటు అధికారికంగా పోలీసులకు స్థానిక ప్రజా ప్రతినిధులకు సైతం ఫిర్యాదు చేశారు. మరోపక్క ఢిల్లీకి సంబంధించిన ప్రత్యేక టీం ఈ మంటలు పూర్తిగా అదుపు చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు ఘటన ప్రాంతానికి నిన్న గురువారం మధ్యాహ్నం చేరుకొని మరింత శ్రమిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *