సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కోనసీమ జిల్లాలోని రాజోలు మండలం శివకోడులోని ఓ ఆక్వా చెరువు వద్ద బోరులోంచి తీవ్రస్థాయిలో ఫోర్స్ గా గ్యాస్ వెలువడుతూ 20అడుగులమేర అగ్ని కీలలు, ఎగసిపడుతుం డటంతో స్థానికులు భయాం దోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ రంగంలోకి దిగింది. మంటలార్పేం దుకుఅగ్ని మాపక, ఓఎన్జీసీ సిబ్బంది నిన్న నేడు, శనివారం తీవ్రం గా శ్రమిస్తున్నారు. విషయంలోకి వెళ్ళితే .. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో గ్యాస్ కోసం గతంలో సెస్మిక్ సర్వే జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆక్వాచెరువుల్లో నీటి కోసం అదే చోట 6 ఏళ్ల కిందట వేసిన బోరు నీరు ఆగిపోవడంతో.. రెండు రోజుల కిందట ఈ బోరును మరింత లోతుకు తవ్వారు. దీంతో భూమిలోని భారీస్థాయి లో గ్యాస్ బయటికి వేగంగా నిరంతరంగా ఆగకుండా వస్తుండటంతో మంటలు అదుపు చేయడం కోసం ఓఎన్జీ సి అధికారులు శ్రమపడుతున్నారు. నేడు బోరులో గ్యాస్ ను అదుపులోకితెచ్చే అవకాశం ఉంది. ఈ బోరులో ఏ మేర గ్యాస్ నిల్వలు ఉన్నాయో ?అధికారులు అంచనా వేసి కార్యచరణలో దిగనున్నారు.
