సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో నేడు, శనివారం ఉదయం మడికి జాతీయ రహదారిపై వ్యాను, కారు ఢీకొన్నా యి. ఘోర రోడ్డు ప్రమాదం లో 4గురు ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి సమీపంలోని చోడవరానికి చెందిన 9 మంది టాటా మ్యాజిక్ వ్యాన్లో కొత్తపేట మండలం మందపల్లి లో శనీశ్వరునికి పూజలు చేయించుకోవడానికి వెళ్తున్నా క్రమం లో విశాఖ నుంచి భీమవరం వెళుతున్న కారు అదుపుతప్పి వ్యాన్ ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న ముగ్గురు,కారులో భీమవరం కు ప్రయాణిస్తున్న ఒక్కరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పో యారు. గాయపడిన మరో 9 మందిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్ప త్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మడికి జాతీయ రహదారిపై వ్యాను, కారు ఢీకొన్నాయి. పోలీస్ దర్యాప్తులో పూర్తీ వివరాలు తెలియవలసి ఉంది.
