సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాలలో నేటి, బుధవారం కనుమ పర్వదినం… కనుమ రోజు అయితే కోనసీమ లో గోదావరి వాసులు, రైతులు సంక్రాంతి సంబరాలు చూసేవారికి హోరు కన్నుల పండుగ అయ్యింది.. ప్రతి ఇంట పితృదేవతల పేరిట నూతన వస్త్రాలు, బియ్యం వితరణ, పశువులకు ప్రత్యేక అలంకరణ, పూజలు, పలు ఆలయాల వద్ద తీర్థ మహోత్సవాలు, అర్చనలు, అభిషేకాలు వీటన్నిటిని మించి సంప్రదాయంగా చేస్తున్న ప్రభల తీర్ధాలు.. ప్రతి గ్రామం నుండి వారి దేవాలయాల నుండి ప్రభలు భారీ ఎత్తున మేళతాళాలతో పచ్చని పంట పొలాలలోకి సెలయేళ్ళు దాటుతూ యువకులు 25 అడుగుల నుండి 10 అడుగుల దేవుళ్ళ ప్రభలను మోస్తూ తరలి వెళ్లి సాయంత్రం వరకు కొలువు దిరటం ఆ ప్రాంత ప్రజలు అందరు అక్కడ ఏర్పాటు చేసిన తీర్ధంలో వేలాదిగా పాల్గొని వారి ప్రాంతాల ప్రభల వద్ద దేవుళ్ళకు పువ్వులు పళ్ళు సమర్పించడం గొప్ప అనుభూతి. ఈ నేపథ్యంలో జగయ్య పేట, పల్లె పాలెం. అంబాజీపేట పరిసర ప్రాంతాలలో ప్రభల తీర్ధం సంబరాలు అంబరాన్ని అంటాయి. కేరళ అందాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా కోనసీమ మురిసిపోయింది.
