సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలోని మోరి-5 బావిలో సంభవించిన గ్యాస్ లీక్ బ్లోఔట్‌ మంటలు మంటలు, ఎట్టకేలకు 6 రోజుల తరువాత అదుపులోనికి వచాయి. దీంతో ఇరుసుమండ, లక్కవరంతో పాటు పరిసర గ్రామాల్లోని ప్రజలు లో ఆందోళన తగ్గి సంక్రాంతి పండుగ సంబరాలకు సిద్ధం అవుతున్నారు. నిన్నటి వరకు భయబ్రాంతులకు గురిచేసిన గ్యాస్ మంటలు ఢిల్లీ నిపుణులు వచ్చాక అదుపులోకి రావడంతో ఇరుసుమండ ఓఎన్జీసీ సిబ్బందిలో సంబరాలు చేసుకొని మిఠాయిలు పంచుకొన్నారు. ఈనెల 5న బ్లోఔట్‌ సంభవించిన తరువాత ఇరుసుమండ, లక్కవరంతో సహా వివిధ ప్రాంతాలకు చెందిన 500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి ఆహార వసతులు కల్పించారు. ఇప్పటి వరకు 5 గ్రామాలకు నిలిపివేసిన విద్యుత్‌ సౌకర్యాన్ని పునరుద్ధరించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *