సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలో మరోసారి ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ వద్ద పైపు లైన్ నుంచి భారీగా గ్యాస్ లీకవడం స్థానికులతో ఆందోళన రేపుతోంది. పొగ తరహాలో దట్టంగా బయటకు చిమ్ముతున్న గ్యాస్ సమీప ప్రాంతమంతా ప్రడ్డ ఎత్తున వ్యాపించింది. ఇటీవల డ్రిల్లింగ్ పూర్తి చేసి రిగ్ తొలగించిన తర్వాత ఈ లీక్ వచ్చినదని స్థానికులు తెలిపారు. గ్యాస్ లీక్‌తో స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.గత నెల (జనవరి)5న మలికిపురం మండలంలోని ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ వెల్ వద్ద భారీ గ్యాస్ లీక్ జరిగి మంటలు ఎగసిపడ్డాయి. ఇది బ్లోఅవుట్‌గా మారి వారం రోజులు కంగారు పెట్టింది. తరుచు . ఓఎన్జీసీ నిర్లక్ష్యం వల్ల కోనసీమ జిల్లాలో తరచూ ఇలాంటి గ్యాస్ లీక్‌లు జరుగుతున్నాయని, ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *