సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం సీఎం చంద్రబాబు కోనసీమ జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ఓడలరేవులో తుఫాన్ బాధితులను సీఎం పరామర్శించారు. తుఫాన్ బాధితులకు నిత్యావసరాలు, రూ.3వేలు చప్పున పరిహారం అందజేశారు. మత్స్యకారుల కుటుంబాలకు 50కిలోల బియ్యం అందించారు.తదుపరి అల్లవరం మండలంలోని బెండమూరులంక రేవులో పడిపోయిన కొబ్బరి చెట్లను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగాఅయన మాట్లాడుతూ..పెద్ద తుపాను ముప్పు తప్పిందని తుఫానుపై ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కోనసీమతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వరి, ఆక్వా, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం నమోదైందని తెలిపారు. ఆస్తి నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు. కౌలు రైతులకు పరిహారం అందిస్తామని భరోసా కల్పించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి రూ.3వేలు, రేషన్ సరుకులు ఇస్తున్నామని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *