సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోనసీమ జిల్లా లో నేడు బుధవారం 11 ఏరియా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు ఉచిత భోజనాలు పూర్తిగా నిలిచిపోయాయి.అయితే స్థానిక ఎమ్మెల్యేల చొరవతో పలు స్వచ్చంధ సంస్థలు రోగులకు భోజనాలు అందించడం శుభ పరిణామం. బోజన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని తాజా వార్తాకథనం.. వివరాలలోకి వెలికితే కోనసీమ జిల్లాలో రూ. 38 లక్షల బిల్లులు బకాయి ఉన్నట్లుగా కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అమలాపురంలో రూ. 13 లక్షలు, రామచంద్రాపురంలో రూ. 9 లక్షలు, కొత్తపేటలో రూ. 6 లక్షలు, రాజోలులో రూ. 5 లక్షలు, అల్లవరం, కపిలేశ్వరంలో రూ. లక్ష, ఆలమూరులో రూ. 91వేలు, ముమ్మడివరంలో రూ. 81వేల బిల్లులు నిలిచిపోయినట్లుగా కాంట్రాక్టర్లు తెలిపారు. భోజనాలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీంతో స్వచ్చంధ సంస్థలు రోగులకు భోజనాలు అందిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వ అధికారులు తక్షణం స్వాందించవలసి ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *