సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి తోటల పునరుద్దరణ స్కీమ్ అమలులో ఉంది.నష్టపోయిన కొబ్బరి రైతులకు ప్రభుత్వం ఈ పథకం కింద సాయం అందిస్తుంది. చనిపోయిన కొబ్బరి చెట్లకు , కాయలు కాయని చెట్లకు ప్రభుత్వం డబ్బుల ఇస్తుంది. గతేడాది మే, జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన, కాయలు కాయని చెట్లను ఉద్యానవన శాఖ గుర్తించింది. రైతుల పేర్లు నమోదు చేసుకుంది. నష్టపోయిన ఆ రైతులకు ఆర్థిక సాయం కింద కొంత డబ్బు వారి అకౌంట్లలో పడింది. ప్రభుత్వం ఒక్కో చెట్టుకు 1000 రూపాయలు సాయం చేసింది. కోనసీమలో 850 హెక్టార్లలో 23 వేలకు పైగా కొబ్బరి చెట్లకు ప్రభుత్వం నేడు, బుధవారం డబ్బులు విడుదల చేసింది.1330 రైతులకు ఏకంగా 2.3 కోట్ల రూపాయలు వారి అకౌంట్లో జమ అయ్యాయి. కోనసీమ రైతులు తప్పని సరిగా కొబ్బరి చెట్ల పునరుద్ధరణ స్కీమును వినియోగించుకోవాలని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *