సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోనసీమ జిల్లా ముమ్మిడివరం వద్ద కమినిలంక గ్రామంలో గోదావరిలో (Godavari River) తీవ్ర విషాదం అలముకొంది. గత సోమవారం సాయంత్రం ఒక శుభకార్యాక్రమానికి కాకినాడ మండపేట నుండి వచ్చిన 11 మంది యువకులు సరదాగా నదిలో స్నానానికివెళ్లగా వారిలో ఎనిమిది మంది యువకులు గల్లంతు అయ్యారు. (8 Youth Missing) వారి కోసం గత రాత్రి నుండి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం సమీపంలో నేటి మంగళవారం ఉదయానికి 4గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.వారిని రాజేష్ మహేష్, క్రాంతి, పాల్ గా గుర్తించారు. ఇంకా మరో 4గురి యువకుల ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తెల్లవారు వరకు ఫ్లడ్ లైట్లు గజ ఈత గాళ్ళు.. వలల సాయంతో అధికారులు గోదావరిని జల్లెడ పట్టారు. గల్లంతయిన ఎనిమిది మందిలో నలుగురు రెండు కుటుంబాలకు చెందిన సొంత సోదరులు. దీంతో యువకుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.
