సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వరుసగా పౌల్ట్రీ లలో లక్షలాదిగా కోళ్లు చనిపోవడానికి బర్ద్ ఫ్లూ గా వైద్యులు గుర్తించడంతో పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లు ఆదేశాలలతో తణుకు, వేల్పూరు పరిసర ప్రాంతాలలో కోళ్ల షెడ్లను మూసివేశారు. చికెన్ అమ్మకాలపై నిషేధం విధించారు. క్రోడి గుడ్లపై కూడా ప్రజలు ఆలోచించాలి . బర్ద్ ఫ్లూ ప్రబలాటంతో పలు రకాల పక్షలు కూడా చనిపోతున్నాయని సమాచారం.భీమవరం పరిసర ప్రాంతాలలో పంట కాలువలలో చనిపోయిన కోళ్లను పౌల్ట్రీ యజమానులు మూటకట్టి పడవేస్తున్నారని, నీళ్లు కలుషితమై తమకు ఆ నీళ్లు తాగిన పశువులకు తీవ్ర అనారోగ్యాలతో ప్రమాదం ఏర్పడిందని స్థానిక జిఎన్ వి పంట కాల్వ లో గత వారం రోజులుగా ఎన్నో కోళ్లు కొట్టుకొనివస్తున్నాయని పరిసర గ్రామాల ప్రజలు పిర్యాదులు చేస్తున్నారు. అధికారులు విచారణ జరపవల్సి ఉంది’
