సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో కోళ్ల ఫారంలో వైరస్‌ సోకినట్లు అధికారులు నిర్థారించారు. కిలో మీటరు పరిధిలోని రెడ్‌ జోన్‌గా ప్రకటించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ పది కిలో మీటర్లు పరిధిలో చికెన్, కోడి గుడ్లు అమ్మకాలను నిలిపివేశారు. చికెన్‌ తినడం కొన్నాళ్లు ఆపుకోవాలని సూచించారు. ఈనేపథ్యంలో నేడు, బుధవారం తణుకు ఎమ్మెల్యే రాధా కృష్ణ పోల్ట్రీ యజమానులు అధికారులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లక్షలాది కోళ్లు చనిపోవడం దురదృష్టకరమని, తణుకు ప్రాంత పౌల్ట్రీ యజమానులు తీవ్రంగా నష్టపోయారని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇవ్వడానికి చర్యలు తీసుకొంటామని, పౌల్ట్రీ లలో .ఆరువారాలు దాటిన కోడికి రూ. 50, గుడ్లు పెట్టే కోళ్లుకు రూ. 140 చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. ఫారాల్లో ఉన్న కోడిగుడ్లుకు రూ. 3, మేత కిలోకు రూ. 12 చొప్పున ప్రభుత్వ సహాయంగా పరిహారం అందించడానికి చర్యలు చేపట్టాం అన్నారు. అలాగే వేల్పూరులోని వైరస్‌ సోకిన కోళ్లఫారం మూడు నెలల తర్వాత క్వారంటైన్‌ చేసి అనంతరంరా వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంటుంది అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *