సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: సంక్రాంతి పండుగ సంబరాలు నేడు, ముక్కనుమ తో ముగియనున్నాయి. ఇక కోవిద్ కట్టడికి ఏపీలో రేపటి మంగళవారం రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నియంత్రణ చర్యలు, వైద్య ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు, సోమవారం సమీక్ష చేపట్టారు. ఏపీలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారితో పండుగ వెళ్లాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ సమీర్‌శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా నియంత్రణలో భాగంగా ట్రేసింగ్, టెస్టింగ్‌పై ఏపీ ప్రభుత్వం కీలక దృష్టి పెట్టింది. ఇప్పటికే ఆక్సిజన్ సహా అన్ని ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి రానుంది. మాస్క్ లేకపోతే జరిమానాతో పాటు ఇతర కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నారు.
