సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో శీతల కాలంలో ఎడతెరపి లేని వర్షాలతో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న గత 4 రోజులుగా మధ్యాహ్నం ఎండలు కాస్తున్న సాయంత్రం నుండి రాత్రి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గోదావరి జిల్లాలు కోనసీమ శ్రీకాకుళం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. రాత్రి పూట 8 దాటాక పొగమంచు, చలితో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ‘అస్మా’ రోగులతో పాటు పెద్దలు పిన్నలు పొడి దగ్గు , పడిశం, వళ్ళు నొప్పులు ఫ్లూ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. తుని మొదలు శ్రీకాకుళం వరకు ఏజెన్సీలో కొండలు మంచుతో కాశ్మీరును తలపిస్తున్నాయి.ఇప్పుడే ఇలా ఉంటే.. వచ్చే జనవరి నెలలో ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *