సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతం మలేషియా సముద్ర పరిసర ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం. నేడు మంగళవారం భారత్ లోని దక్షిణ అండమాన్‌లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆపై 48 గంటల్లో వాయుగుండం బలపడుతుందన్నారు. దక్షిణ బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ క్రమంలోనే దక్షిణ కోస్తా ఆంధ్ర లో మత్స్యకారులు స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని సూచించారు. అల్పపీడనాల ప్రభావంతో దక్షిణ కోస్తాలో 5 రోజుల పాటు మోస్తరు వర్షాలు.. ఈ నెల 28 తర్వాత ఉత్తర కోస్తా జిల్లాలకు అక్కడక్కడ భారీ వర్షాలు మరికొన్నిచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. అయితే కొత్తగా శ్రీలంక, నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపారు. కాగా, వాతావరణ శాఖ ఇచ్చిన భారీ వర్షపాతం హెచ్చరికలు ఇలా ఉన్నాయి. ఏదిఏమైనా కోస్తా ఆంధ్రాలో ఈ నెల 28, 29వ తేదీలలో అనేక చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశంతొ పాటు అలాగే ఈ నెల 30వ తేదీ, డిసెంబర్ 1న కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 2న కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో మత్స్యకారులు, రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది.
