సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో నేడు, శుక్రవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ దిశగా కదులుతూ నేటి శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఎల్లుండి ఆదివారం దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం ప్రాంతంలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అల్ప పీడన ప్రభావంతో ఇప్పటికే గోదావరి జిల్లాలలో చిరు జల్లులతో పాటు తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. నేడు, రేపు శనివారం పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి
