సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కోస్తా ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యంగా ఉత్తరాంధ్ర కు మరో తుపాన్ గండం పొంచివుంది. దక్షిణ థాయ్‌లాండ్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది అండమాన్ సముద్రం పరిసరాల్లోకి ప్రవేశించి, ఆ తరువాత పశ్చిమ వాయవ్యంగా పయనించి నేడు, గురువారానికి వాయుగుండంగా మారి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత రేపు శుక్రవారంవాయవ్యంగా పయనించి తుఫాన్‌గా మారనుంది. తుఫాను బహుశా శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర తీరం దిశగా రానుంది. మూడో తేదీ నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దీనికి ‘జావద్’ అని నామకరణం చేశారు.
