సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోస్తా ఆంధ్ర ప్రజలకు ఒకప్పుడు రైల్వే ప్రయాణం అంటే ఎంతో సౌఖ్యంగా ఉండేది. 2020 కొవిడ్ ప్రతిష్టంభన మొదలు వరుసగా 2 ఏళ్ళ ప్రభావం తో ఆనాటి నుండి పలు ఎక్స్ ప్రెస్ రైళ్ల బోగీల సంఖ్యా తగ్గించడం ఫై సీట్లు సరిపోక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు ఫై చూపిస్తుంది. .. దానికి తోడు ఇప్పటికి కొనసాగుతున్న రైల్వే ఆధునీకరణ పనుల నేపథ్యంలో ఏ రైలు ఎప్పుడు వెళుతుందో ఎప్పుడు రద్దు చేస్తారో.. ఎంత కాలం సంబంధిత రైలు సేవలు నిలిపివేస్తారో ఎవరికీ తెలియని గందర గోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో ముఖ్యంగా విజయవాడ మీదుగారైలు ప్రయాణాలు చేసే గోదావరి జిల్లాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ రైల్వే శాఖ దృష్టికి వెళ్లాయి. సమస్యలు ఇప్పుడు ఇప్పుడే ఒక కొలిక్కి వస్తున్నాయి. తాజా శుభవార్త ఏమిటంటే.. కోవిడ్ తరువాత పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నా మమాత్రం జనరల్ బోగీలతో నడుపుతూన్న రైల్వేశాఖ తాజగా బోగీల సంఖ్యని పెంచాలని నిర్ణయించింది. గుంటూరు మీదగా ప్రయాణించే 12 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు జనరల్ బోగీలు జతచేస్తారు. వచ్చే వారం నుంచి ఈ బోగీలను జోడించి నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. వాటిల్లో సికింద్రాబాద్-హౌరా, హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, కాకినాడపోర్టు-భావనగర్, భావనగర్-కాకినాడపోర్టు వీక్లీఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-భువనేశ్వర్, భువనేశ్వర్ -సికింద్రాబాద్ విశాఖఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం-యశ్వంత్‌పూర్, యశ్వంత్‌పూర్-మచిలీ పట్నం కొండవీడుఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం-ధర్మవరం, ధర్మవరం-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, కాకినాడపోర్టు-ఎల్‌టీటీ (ముంబై), ఎల్‌టీటీ-కాకినాడపోర్టు ఎక్స్‌ప్రెస్‌లున్నాయి. ప్రస్తుతం ఈ రైళ్లు కేవలం 2జనరల్ బోగీలతో నడుస్తున్నాయి.
