సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో వాయుగుండం పశ్చిమ నైరుతిగా పయనించి నేటి ఆదివారం ఉత్తర శ్రీలంకలో తీరం దాటి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఇది పశ్చిమ నైరుతిగా పయనిస్తూ రేపు సోమవారం ఉదయానికి కొమెరిన్ తీరం దిశగా వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్ర లోను , రాయలసీమ లో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. తిరుమలలో భక్తులకు ఇబ్బంది కలిగింది. తిరుపతి లో కుంభవృష్టి కురిసింది. రానున్న 24 గంటల్లో దక్షిణకోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, చింతపల్లి, అరకులోయ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం కొనసాగింది. పాడేరు సమీపంలోని జి.మాడుగులలో 5.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
