సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఊహించని విధంగా తమినాడు మీదుగా వాయువ్య దిశగా పయనించి కోస్తా ఆంధ్ర తీరా ప్రాంతాల మీదుగా పయనించనుంది. ఇప్పటికే గత 2 రోజులుగా ఏపీలో వర్షాలు పడుతున్నాయి. తాజా పరిణామాలలో గోదావరి జిల్లాల తో పాటు రానున్న 24 గంటల్లో ఆంధ్రా తీరం మీదుగా అల్ప పీడనం ఉత్తర దిశగా పయనించే అవకాశముంది.నేడు, గురువారం కోస్తా ఆంధ్ర లో గాలుల వేగం 35 నుంచి 45 కి.మీ ఉంటుంది. కొన్ని సమయాల్లో 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముంది. అందువల్ల ఆయా ప్రాంతాలకు జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్ర తో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోని కారైక్కాల్ ప్రాంతాల్లో ఈ నెల 24వ తేది వరకు వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది.
