సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపు ఎన్నికల కౌంటింగ్ లో ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు ప్రధానంగా జిల్లా కేంద్రం .భీమవరం పట్టణం ప్రజానీకానికి పార్టీల క్యాడర్ కు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, మరియు ఎస్పీ అజిత వేజెండ్ల కీలక ఆదేశాలు జారీచేశారు. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ఉద్రికతలు తలెత్తకూడా గుంపులుగా ప్రజలు తిరగడాన్ని నిషేధిస్తూ 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలలో పార్టీల కార్యకర్తలు ఉండకూడదని అక్కడ 3 అంచల పోలీస్ భద్రతా వ్యవస్థ పర్యవేక్షిస్తుందన్నారు. పలు మార్గాలలో ట్రాఫిక్ మళ్లించడం జరిగిందని ప్రయాణికులు సహకరించాలని అన్నారు. రేపు మంగళవారం భీమవరం లో కౌంటింగ్ హాల్స్ నుండి సాధ్యమైనంత వేగంగా అధికారికంగా ఫలితాలు వచ్చేలా ఏర్పాట్లు జరిగాయన్నారు. భీమవరం కౌంటింగ్ హాళ్ల వద్ద నుండి జిల్లా వ్యాప్తంగా గెలిచిన అభ్యర్థులు కు ఊరేగింపులు, రెచ్చగొట్టే ధోరణులకు, ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. పార్టీలు వ్యక్తులు ఎవరైనా ఇటువంటి పనులకు పాల్బడితే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. జిల్లాల్లో నేడు సోమవారం , రేపు, ఎల్లుండి కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. భీమవరం పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయాలు, అభ్యర్థుల నివాసాలు, ప్రధాన సెంటర్స్ కీలక ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతను పెంచడం జరిగిందన్నారు. ఫలితాలు ఏమైనప్పటికి ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు నేతలు సమన్వయంగా వ్యవహరించాలని , మీడియా ప్రతినిధులు ,ఛానెల్స్ కూడా వార్తలను ఉద్రిక్తలలకు తావు లేకుండా వాస్తవాలు ప్రసారం చెయ్యాలని కోరారు. తాజా సమాచారం ప్రకారం.. రేపు భీమవరం పట్టణం లోని ప్రధాన సెంటర్స్ లో దుకాణాలు మూసివేసి సహకరించాలని వ్యాపారులను పోలీసు అధికారులు అభ్యర్థిస్తున్నారు.
