సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 2 దశాబ్దాల పైగా..కౌన్ బనేగా కరోడ్‌పతి అనగానే అందరి మదిలో మొదటిగా మెదిలే రూపం బిగ్ బీ ‘అమితాబ్ బచ్చన్’ ఆయన గంబీర స్వరం..ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అబాలగోపాలాన్ని అలరించడంతో పాటు ప్రేక్షకులకు విజ్ఞానాన్ని ఎన్నో అనుభూతులను కూడా పంచింది. ప్రస్తుతం జరుగుతున్న కేబీసీ-15 (KBC-15) సీజన్ ముగిసింది. డిసెంబర్ 29వ తేదీన అంటే నిన్న శుక్రవారం నాడు ఈ సీజన్‌కు బిగ్ బీ వీడ్కోలు పలికారు. కేబీసీ-15 సీజన్ వీడ్కోలు సందర్భంగా అమితాబ్ కాస్త ఎమోషనల్ అయ్యారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్.. మేం వీడ్కోలు పలుకుతున్నాం. ఈ వేదిక రేపట్నుంచి కనిపించదు. రేపట్నుంచి మేం ఇక్కడకు రావడం లేదు అని చెప్పాలనిపించడం లేదు. నేను, అమితాబ్ బచ్చన్, ఈ సీజన్‌లో చివరి సారిగా నేను చెప్పేది ఒక్కటే.. గుడ్ నైట్.. గుడ్ నైట్ అని అమితాబ్ భావోద్వేగానికి గురయ్యారు. వయస్సు భారం మీద పడటం తో బహుశా ఇక సీజన్ కు అమితాబ్ వీడ్కోలు పలికే అవకాశం ఆయన మాటలలో ధ్వనించింది.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీజన్‌లో 21 ఏళ్ల జస్కరన్ సింగ్ మొదటి మిలీనియర్‌గా నిలవడం విశేషం..
