సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ త్వరలో సొంత డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయబోతోందని యూనియన్ మినిష్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పియూష్ గోయల్ తాజగా కీలక ప్రకటన చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మద్దతుతో ఈ డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి ప్రస్తుతం ఖతర్‌లోని దోహలో పర్యటిస్తున్నారు. దోహలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ.. ‘సాధారణ కరెన్సీకి ఉన్నట్లే ఈ డిజిటల్ కరెన్సీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారెంటీ ఉంటుంది. డిజిటల్ కరెన్సీ ద్వారా లావాదేవీలు అత్యంత ఈజీగా,పారదర్శకత, ఎఫెక్టివ్‌గా జరుగుతాయి. పేపర్ వాడకం బాగా తగ్గుతుంది. బ్యాంకింగ్ సిస్టమ్‌లో జరిగే లావాదేవీల కంటే డిజిటల్ కరెన్సీ లావాదేవీలు చాలా వేగవంతంగా ఉంటాయి అని అన్నారు.తాము క్రిప్టో కరెన్సీని ప్రోత్సహించటం లేదని స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీకి ఆర్‌బీఐ లాంటి సంస్థల మద్దతు లేదని, ఆస్తులు కూడా లేవని, భరోసా లేనిదని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *