సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం సూచీలు లాభాలలో దూసుకొనిపోయాయి. దీంతో ఈ రోజు గురువారం సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి. గత బుధవారం భారీ లాభాలను చవిచూసిన దేశీయ సూచీలు నేడు గురువారం కూడా అదే లాభాలు కొనసాగించాయి. గత బుధవారం సెషన్ ముగింపు (85, 609)తో పోల్చుకుంటే నేడు గురువారం సెన్సెక్స్ 110 పాయింట్ల లాభంతో 85, 720 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 10 పాయింట్ల లాభంతో 26, 215 వద్ద స్థిరపడింది (stock market ).నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 51 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 209 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.31గా ఉంది.
