సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే (Good Friday)ను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వారికీ అభినందనలు తెలుపుతూ..క్రైస్తవ చర్చలలో పాస్టర్లకు (Pastors) గుడ్ న్యూస్ (Good News) చెప్పారు. పెండింగ్ లో ఉన్న పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలోని 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనం విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2024, మే నుంచి నవంబర్ వరకు ఈ గౌరవ వేతనం విడుదల చేయనున్నారు. ఈ ఏడు నెలల కాలానికిగాను రూ. 30 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడు నెలలకు ఒకొక్క పాస్టర్‌కు ఒక్కసారిగా రూ. 35 వేల చొప్పున వేతనం అందుతుంది. UP FILE PHOTO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *